స్వామి అగ్నివేశ్ దాడి ఘటనపై రాహుల్ హాట్ రియాక్షన్, ప్రధాని మోడీకి చురకలు
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ దాడి ఘటనపై ఏఐసీపీ చీఫ్ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. సామజిక కార్యకర్తపై బీజేవైఎం కార్యకర్తలు ఇలా అనాగరికంగా దాడికి పాల్పడటంపై సిగ్గుచేటన్నారు. అగ్నివేశ్ పై జరిగిన దాడి అరాచక చర్య అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ ప్రధాని మోడీని పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు... ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
రాహుల్ తన ట్వీట్ లో మోడీని ఉద్దేశించి ఏమన్నారంటే... 'నేను అందరికంటే బలవంతుడిని..అంతులేని శక్తి నా సొంతం... ద్వేషం, భయం అనే రెండు ఆయుధాలు ఉపయోగించి అధికారం అనుభవిస్తా..బలహీనులను అణచివేస్తా.. నేను ఎవరిని ?’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. స్వామి అగ్నివేశ్ పై బీజేవైఎం కార్యకర్తలు దాడికి పాల్పడుతున్న వీడియోను దీనికి జతచేయడం గమనార్హం.