భారతీయ రైల్వే శాఖ ఓ విన్నూత ఆఫర్‌ను ప్రకటించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు రైల్వే శాఖ రివార్డ్స్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం వడోదర రైల్వే స్టేషన్‌ సహా పలు రైల్వే స్టేషన్లల్లో బాటిల్‌ క్రషర్లను ఏర్పాటు చేసింది. క్రషింగ్‌ మిషన్‌లో ప్లాస్టిక్‌ బాటిల్‌ వేస్తే, ఒక్కో బాటిల్‌కు ఐదు రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ప్రయాణికుల పేటీఎం అకౌంట్‌లో క్రెడిట్‌ చేయనుంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ను పొందాలంటే మీ వద్ద తప్పనిసరిగా మొబైల్ ఉండాల్సిందే. బాటిల్‌ను వేసిన తర్వాత ప్రయాణికులు మొబైల్‌ నెంబర్లను నమోదు చేస్తే.. ఆ మొబైల్‌ నెంబర్‌తో లింక్‌ అయి ఉన్న పేటీఎం అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తాయంది. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రైల్వే శాఖ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌తో కొంతవరకైనా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించవచ్చని రైల్వే శాఖ యోచన.


ఒక్కో క్రషర్ యంత్రం ధర రూ. 4.5 లక్షలు. బాటిల్‌ను యంత్రంలో వేస్తే..  క్రష్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుతుంది. ఇటీవలే ఈ ప్లాస్టిక్ క్రషర్ యంత్రాలను సౌత్ వెస్ట్రన్ రైల్వే మైసూరు డివిజన్‌లో.. ప్రస్తుతం వదోదర రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్, పూణే, ముంబై రైల్వే స్టేషన్లలో విస్తృతంగా ఈ మెషిన్లు వినియోగిస్తున్నారు.