Railway Reservation: రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్.. 7 రోజులు, ప్రతీరోజూ 6 గంటలు రిజర్వేషన్ సేవలు నిలిపివేత
Railway Reservation : రైల్వే ప్రయాణికులకు వారం రోజుల పాటు ప్రతీ రోజు ఆరు గంటల పాటు రిజర్వేషన్ సర్వీసులకు అంతరాయం కలగనుంది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌తో పాటు డేటా అప్‌లోడ్‌లో భాగంగా రైల్వే శాఖ టికెట్ బుకింగ్ సేవలను రాత్రిపూట ఆరు గంటలు నిలిపివేస్తోంది.
Railway Reservation : రైల్వే ప్రయాణికులకు (Indian Railway) రైల్వే శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. వారం రోజుల పాటు ప్రతీరోజూ ఆరు గంటలు దేశవ్యాప్తంగా రైల్వే రిజర్వేషన్ (Railway Reservation) సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపింది. రైల్వే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. నవంబర్ 14-15 తేదీ రాత్రి నుంచి నవంబర్ 20-21 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రక్రియ జరగనుంది. ఈ వారం రోజుల్లో రాత్రిపూట 11.30గం. నుంచి తెల్లవారు జామున 5.30గంటల వరకు రైల్వే రిజర్వేషన్ సేవలు అందుబాటులో ఉండవు. రిజర్వేషన్ బుకింగ్‌తో పాటు కరెంట్ బుకింగ్, (Railway Booking) టికెట్ల రద్దు, ఎంక్వైరీ తదితర సేవలు కూడా ఆరు గంటల పాటు నిలిచిపోనున్నాయి.
'సిస్టమ్ డేటా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్త ట్రైన్ నంబర్లను (Trains) అప్‌డేట్ చేసేందుకు ఈ వారం రోజులు ఆరు గంటల పాటు పలు రైల్వే సేవలు నిలిపివేస్తున్నాం. అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల పాత నంబర్లను ప్రస్తుత ప్యాసింజర్ బుకింగ్ డేటాతో (Passenger trains) అప్‌డేట్ చేస్తున్నాం. టికెటింగ్ సర్వీసులపై దీని ప్రభావం తగ్గించేందుకు రాత్రి పూట ఈ ప్రక్రియ చేపడుతున్నాం.' అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వేషన్ సహా కొన్ని సేవలు మినహాయిస్తే టెలిఫోన్ సేవలతో పాటు మిగతా 139 సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
Also Read : Mahesh-Rajmouli Combo: సమంత 'దూకుడు'.. మహేష్-జక్కన్న సినిమాలో హీరోయిన్‌గా సామ్..??
కరోనా (Covid 19) సమయంలో రైల్వే శాఖ (Indian Railway) కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిన సంగతి తెలిసిందే. వీటికి రైల్వే శాఖ ప్రత్యేక నంబర్లను కేటాయించింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో క్రమంగా రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే చాలావరకు రెగ్యులర్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటి పాత నంబర్లను రైల్వే సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వ్‌డ్ రైళ్ల నంబర్లను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు స్పెషల్ ట్రైన్స్ పేరిట నడిపిన రైళ్లలో ప్రయాణంతో సామాన్యులపై భారం పడింది. గత శుక్రవారం నుంచి ఆ స్పెషల్ ట్రైన్ ట్యాగ్‌ను రైల్వే శాఖ తొలగించింది. కరోనాకు ముందు ఉన్న టికెట్ ధరలనే తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి