Lockdown: రైల్వే శాఖ సంచలన నిర్ణయం..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కార్మికులకు తమ స్వస్థలాలకు చేరవేసే కార్యక్రమంలో భాగంగా రైల్వే శాఖ ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రైల్వే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ Lockdown నేపథ్యంలో ఎంతో మంది వలస కార్మికులకు తమ స్వస్థలాలకు చేరవేసే కార్యక్రమంలో భాగంగా రైల్వే శాఖ ప్రత్యేకంగా శ్రామిక్ స్పెషల్ రైళ్ళ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో రైల్వే విభాగం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్ళు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. వలస కార్మికుల్లో మహిళలు, పిల్లలు, వయో వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖల ద్వారా తెలియజేశారు.
Also Read: పదో తరగతి పరీక్షలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
రాష్ట్రాలు, రైల్వే మంత్రిత్వశాఖ సమన్వయంతో స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడపాలని, వలసకార్మికుల విశ్రాంతి స్థలాల్లో శానిటేషన్, ఆహారం, వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. వలస కార్మికులను రైళ్లు,బస్సుల్లో పంపేటప్పుడు పారదర్శకత ఉండాలని, అది లోపించడంతో అనేక వదంతులు వ్యాప్తి చెంది వలస కార్మికుల్లో ఆందోళన పెరుగుతోందని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల నిర్దిష్ట అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. నిర్దేశిత విశ్రాంతి స్థలాలకు, సమీప బస్సు స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు కాలినడకన బయలుదేరే వారికి జిల్లా అధికారులు మార్గదర్శకులు కావాలని, వారికి రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు. అంతర్రాష్ట సరిహద్దుల్లో వలస కార్మికుల బస్సులు ప్రవేశించేలా చూడడంతోపాటు ఆహారం, ఆరోగ్యభద్రత, కౌన్సెలింగ్ వంటివి తగిన విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Also Read: 400 మిలియన్ల యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన వాట్సాప్..