హైదరాబాద్: కరోనా మహమ్మారి దాల్చడంతో అర్ధాంతరంగా తెలంగాణ వ్యాప్తంగా Lockdown కారణంగా నిలిపివేయబడ్డ పదో తరగతి పరీక్షల నిర్వహణకు తిరిగి పున:ప్రారంభానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చని, ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఇవ్వవల్ని సూచించింది. ఇప్పుడున్న పరీక్ష కేంద్రాలకు రెట్టింపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, పరిశుభ్రత పాటించే విధంగా సానిటైజర్స్ ను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశమిచ్చింది.
Also Read: 400 మిలియన్ల యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన వాట్సాప్..
ఇదిలాఉండగా తెలంగాణలో కొత్తగా మరో 42 (Covid-19) కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,634కి చేరింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 కేసులు నమోదు కాగా మరో 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వలస కూలల సంఖ్య 77కి చేరింది. మంగళవారం నాడు కరోనా మహమ్మారి నుండి కోలుకుని 9 మంది డిశ్చార్జ్ కాగా కోలుకున్న వారి సంఖ్య 1,011కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోగా మరో 585 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..