400 మిలియన్ల యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన వాట్సాప్..

400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లున్న భారతదేశంలో వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త అందించింది. డేటా, కన్సల్టింగ్ సంస్థ వివిధ అంతర్జాయతీయ సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం, వాట్సాప్

Last Updated : May 19, 2020, 09:39 PM IST
400 మిలియన్ల యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన వాట్సాప్..

హైదరాబాద్: 400 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లున్న భారతదేశంలో వినియోగదారులకు వాట్సాప్ శుభవార్త అందించింది. డేటా, కన్సల్టింగ్ సంస్థ వివిధ అంతర్జాయతీయ సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం, వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 40% శాతం వాడకం పెరిగిందని వెల్లడించాయి. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ వాట్సప్ స్టేటస్ పైనా ప్రభావం చూపించింది. వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా 30 సెకన్ల పాటు ఉండే వాట్సప్ (Whatsap) వీడియో స్టేటస్ నిడివిని 15 సేకన్లకు తగ్గించింది. కరోనా కష్టకాలంలో చాలావరకు నెట్వర్క్ సమస్యలు ఉత్పన్నమయ్యాయనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: కరోనా నుండి కోలుకున్నప్పటికీ మరో ముప్పు తప్పేలా లేదంటున్న తాజా అధ్యయనాలు..

ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వినియోగదారులందరికీ శుభవార్తనందించింది. దీని వల్ల స్టేటస్ 15 సేకన్లకు కుదించారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ Lockdown  పోడిగించిన భారీగా సడలింపులు ఇవ్వడంతో మళ్లీ వాట్సాప్ స్టేటస్ 30సెకన్లకు పోడిగించింది. దీంతో వాట్సాప్ వినియోగదారులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ వీడియోలు, అరుదైన సంఘటనలను స్టేటస్ ల రూపంలో ఆనందాన్ని పంచుకుంటున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News