Rain Alert: ఏపీ, తెలంగాణలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. నిన్న ఒడిశా తీరం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం..ఇవాళ వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాగల మూడురోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వానలు పడనున్నాయి. రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఇవాళ మోస్తరు వానలు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. 


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండటంతో..ఆ ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులపాటు వానలు పడతాయని విశాఖ, అమరావతి వాతావరణ శాఖలు తెలిపాయి. రాయలసీమలో వరుణుడు శాంతించినట్లు కనిపిస్తున్నాడు. అక్కడక్కడ పొడి వాతావరణం కనిపిస్తోంది.



Also read:Godavari Floods: వరద ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. గవర్నర్ భద్రాచలం టూరే కారణమా?


Also read:Amazon Prime Day Sale: అమెజాన్‌లో ఆఫర్ల పండగ.. కస్టమర్స్ కోసం కళ్లు చెదిరే ఆఫర్స్.. ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు అంటే..   



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook