కొత్త జెండా, నవతరం, `మహా`లో నవనిర్మాణం దిశగా రాజ్ ఠాక్రే
హిందూత్వ భావజాలం వైపు అడుగులు వేస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కాషాయపు రంగు జెండాను తన పార్టీ కొత్త జెండాగా ఆవిష్కరించారు. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే రాజకీయ ప్రవేశం చేశారు. ఆవిష్కరించిన కొత్త జెండా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రాజ ముద్ర, దాని క్రింద పార్టీ పేరు ఉంది.
ముంబై: హిందూత్వ భావజాలం వైపు అడుగులు వేస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కాషాయపు రంగు జెండాను తన పార్టీ కొత్త జెండాగా ఆవిష్కరించారు. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే రాజకీయ ప్రవేశం చేశారు. ఆవిష్కరించిన కొత్త జెండా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క రాజ ముద్ర, దాని క్రింద పార్టీ పేరు ఉంది. గోరేగాన్ లో జరిగిన పార్టీ మొదటి మహా-అధివేషన్ వద్ద కొత్త జెండాను ఆవిష్కరించారు.
సమావేశాన్ని ప్రారంభించిన రాజ్ ఠాక్రే, తన గురువు అయిన శివసేన చీఫ్ దివంగత బాల్ ఠాక్రేకు ఆయన జన్మదిన సందర్బంగా నివాళులు అర్పించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మొదటిసారిగా, వీర్ సావర్కర్ చిత్రపటాన్ని వేదికపై ఉంచారు. దీంతో సావర్కర్ ఒక హిందుత్వ భావజాలంగా పరిగణించబడుతున్న తరుణంలో, పార్టీ హిందుత్వ భావజాలం వైపు అడుగులు వేస్తోందనడానికి మరొక సంకేతంగా భావిస్తున్నారు.
రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రేను పార్టీ నాయకుడిగా మహా అదివేశన్ లో కార్యకర్తలకు పరిచయం చేశారు. గత ఎన్నికలలో వరుస పరాజయాల తరువాత, రాజ్ ఠాక్రే ఇప్పుడు తన పార్టీని తిరిగి పునర్నిర్మాణంకై ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో కేవలం ఒక శాసనసభ్యుడు, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC)లో ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నారు.
మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో రాజ్ ఠాక్రే సమావేశం తరువాత భారతీయ జనతా పార్టీ, ఎంఎన్‌ఎస్ మధ్య సఖ్యత ఏర్పడినట్లు ఊహాగానాలు వచ్చిన తరుణంలో, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ పొత్తుకు అవకాశం లేదని అన్నారు.
ఎంఎన్ఎస్, బీజేపీల మధ్య సైద్ధాంతిక పరమైన వ్యత్యాసం ఉండటం కారణంగా కూటమికి అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇరువురిమద్య సిద్ధాంతాలు భిన్నంగా ఉండే వరకు అది సాధ్యం కాదని అన్నారు. యంఎన్ఎస్ తన భావజాలాన్ని మార్చుకుంటే భవిష్యత్తులో బీజేపీ పొత్తుపై ఆలోచన చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..