Rajasthan Elections Date Changed: రాజస్థాన్‌ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ఓటింగ్ తేదీని మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ రిలీజ్ చేసింది. ముందుగా ఓటింగ్ తేదీని నవంబర్ 23గా నిర్ణయించారు. అయితే తాజాగా నవంబర్ 25వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ తేదీని మార్చాలని వివిధ సంస్థల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ఈసీ మార్పులు చేసింది. నవంబర్ 23న దేవ్‌ ఉథాని ఏకాదశి కావడంతో రాజస్థాన్‌లో భారీగా వివహాలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసీ రీషెడ్యూల్ చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఎన్నికల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. ముందుగా ప్రకటించిన తేదీల్లోనే ఎన్నికలు జరుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 7 నుంచి నవంబర్ 30 మధ్య ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఎన్నికల తేదీని ప్రకటించిన వెంటనే రాజస్థాన్‌లోని అనేక సామాజిక, మత సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. నవంబర్ 23న భారీగా పెళ్లిళ్లు ఉన్నాయని.. ఆ రోజు ఓటు వేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ఈసీకి రిక్వెస్టులు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం స్పందించింది.


ఓటింగ్ తేదీని మార్చాలని వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి డిమాండ్లు లేవనెత్తాయి. ఓటింగ్ రోజున పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతాయని చెప్పారు. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు. పోలింగ్ సమయంలో ఓటరు భాగస్వామ్యాన్ని తగ్గించవచ్చు. నవంబర్ 23 నుంచి నవంబర్ 25వ తేదీకి మారుస్తున్నాం" అని ఎన్నికల సంఘం తెలిపింది.


రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 14తో ముగుస్తుంది. ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 73 స్థానాలను గెలుచుకుంది. ఈసారి రాజస్థాన్‌లో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారోనని ఆసక్తి నెలకొంది.


Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!  


Also Read: When Children Have Children: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం.. 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్' బుక్ ఆవిష్కరణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి