UP Crime News: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలోని దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో చెల్లెళ్లు చూశారని ఓ అక్క ఘతాకానికి పాల్పడింది. ఇద్దరు చెల్లెళ్లలను హత్య చేసి కొత్త నాటకానికి తెరలేపింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులను జైవీర్ సింగ్ కుమార్తెలు సుర్భి (6), రోష్ని (4)గా గుర్తించామని, వారి ఇంటి ప్రత్యేక గదుల్లో ఛిద్రమైన మృతదేహాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ విచారణ చేపట్టామన్నారు. పూర్తి వివరాలు ఇలా..
అంజలి (20) అనే యువతి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అతనితో ఆమె సన్నిహితంగా ఉండగా.. ఇద్దరు చెల్లెళ్లు సుర్భి, రోష్ని చూశారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన అంజలి.. ఆ చిన్నారులు ఎక్కడ తమ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారోనని భయపడిపోయింది. దీంతో చిన్నారులను చూడకుండా.. పదునైన ఆయుధంతో ఇద్దరిని హతమార్చింది. అనంతరం చెల్లెళ్లను ఎవరూ హత్య చేశారంటూ కొత్త నాటకానికి తెరలేపింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను కూడా నమ్మించింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మరకలు ఉన్న అంజలి దుస్తులు ఉండడం గమనించారు. వివరాలు ఆరా తీయగా.. యువతి పొంతనలేని సమాధానాలు చెప్పింది. అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకుంది. హత్యకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు బాలికల మృతదేహాలు ఆదివారం వారి ఇంటిలోని వేర్వేరు గదుల్లో లభ్యమయ్యాయని.. కాగా నిందితురాలి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడి కావడంతో సోమవారం అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సత్యపాల్ సింగ్ తెలిపారు.
అంజలి తన చెల్లళ్లను హత్య చేసేందుకు పలుగు ఉపయోగించిందని.. హత్యల తర్వాత ఆమె పలుగును క్లీన్ చేసి బట్టతో శుభ్రం చేసిందన్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో పారపై రక్తపు జాడలు, నిందితురాలి బట్టల ఉన్న రక్తపు మరకలు ఒకటేనని తేలిందన్నారు. కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారని.. విచారణలో అంజలి తన నేరాన్ని అంగీకరించిందని చెప్పారు. హత్య జరిగిన సమయంలో బాలికల తల్లిదండ్రులు ఇంట్లో లేరని.. తల్లిదండ్రులు లేని సమయంలో అంజలి తన ప్రియుడితో సన్నిహితంగా ఉండడాన్ని చిన్నారులు చూశారని తెలిపారు. ఆ తర్వాత ఆమె వారిని చంపిందని పోలీసులు అదనపు ఎస్పీ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి