Rajasthan Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం..11 మంది దుర్మరణం
ఈ రోజు తెల్లవారు జామున రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. భరత్‌పూర్ జిల్లాలోని జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ట్రక్ డీ కొట్టింది. 11 మంది మరణించగా.. 12 మంది గాయపడ్డారు.
Rajasthan Bus Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొంది. భరత్‌పూర్ జిల్లాలోని జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులోని గుజరాత్ కు చెందిన 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.
ఏం జరిగిదంటే..?
గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మథురకు భక్తులతో ఓ బస్సు బయల్దేరింది. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు బస్సును హంత్ర సమీపంలోని ఓ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రక్కన నిలిపి ఉన్నాడు. తెల్లవారుజామున చీకటి కారణంగా అదే సమయంలో ఓ ట్రక్ వేగంగా వచ్చి బస్సు వెనుక భాగాన్ని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు స్త్రీలు ఉన్నారని తెలుస్తోంది.
ఈ ఘటనలో మృతి చెందిన వారంతా గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలోని దిహోర్ పట్టణానికి చెందిన వారని బస్సులోని మిగిలిన ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన 12 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.
Also Read: 7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక.. నిబంధనల్లో మార్పు
ప్రధానమంత్రి మోదీ సంతాపం
రాజస్థాన్‌లోని భరత్ పూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 11 మంది ప్రయాణికులు మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు రూ. 50 వేల పరిహారాన్ని అందిచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్ కు చెందిన భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని ఆయన అన్నారు. క్షతగాత్రులకు అత్యాధునిక వైద్యాన్ని అందజేసేలా అధికారులను ఆదేశించారు.
Also Read: Jio vs Airtel Fiber Plans: జియో, ఎయిర్‌టెల్ ఫైబర్ ప్రీ పెయిడ్ ప్రాన్స్ ధర, ఓటీటీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook