CM Ashok Gehlot Vs Sachin Pilot: అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజస్థాన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయంతో దేశవ్యాప్తంగా అదే జోరును కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. రాజస్థాన్‌లో నేతల మధ్య అంతర్గత విభేదాలు తలనొప్పిగా మారాయి. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. బీజేపీని దీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాల్సిన తరుణంలో ఈ వ్యవహారం ఆ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సచిన్ పైలట్ పార్టీ మారుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 11న తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి సందర్భంగా సచిన్ కీలక ప్రకటన చేస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్.. వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇటీవల సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో ఢిల్లీలో వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఇద్దరికీ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు విభేదాలను పక్కనబెట్టి కలిసిగట్టుగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం.


గత ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై సీఎం అశోక్ గెహ్లాట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సచిన్ పైలట్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికి తాను రెండుసార్లు లేఖ రాసినా పట్టించుకోవట్లేదని సచిన్ గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నుంచి సచిన్ డబ్బులు తీసుకున్నారని సీఎం గెహ్లాట్ ఆరోపిస్తున్నారు. దీంతో ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.


ఇక సచిన్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. నేతలిద్దరూ కలిసి ఉన్నారని.. హైకమాండ్ సమస్యను పరిష్కరిస్తుందన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికల్లో అందరూ నాయకులు ఐక్యంగా కలిసి పోరాటం చేస్తామన్నారు.  పైలట్‌ పార్టీని వీడారనే వాదనలు పుకార్లేనని కొట్టిపారేశారు. తాను సచిన్‌తో ఫోన్‌ మాట్లాడనని.. పార్టీని వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ వివాదాన్ని పరిష్కరించేందుకు కృషి చేశారని తెలిపారు. సచిన్ పైలట్ పార్టీని వీడుతున్నారనే విషయం మీడియా ద్వారానే తనకు తెలిసిందన్నారు. తానే పైలట్‌తో రెండు మూడు సార్లు మాట్లాడానని.. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.


Also Read: Third Front: 2024 ఎన్నికల నాటికి దేశంలో మూడవ కూటమి ఏర్పాటు కానుందా


సచిన్ పైలట్ కొత్త పార్టీని స్థాపిస్తారని మరికొందరు అంటుండగా.. రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను ఈ విషయాన్ని మీడియా ద్వారా విన్నానని.. అలాంటిదేమీ లేదని భావిస్తున్నట్లు చెప్పారు. సచిన్ మనసులో పార్టీ పెట్టాలనే ఆలోచన ఇంతకు ముందులేదని.. ఇప్పుడు కూడా లేదన్నారు. మీడియానే ఈ అంశాన్ని ప్రచారం చేస్తోందన్నారు.


Also Read: Railway recruitment 2023: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.1,40 వేల వరకు జీతం.. అర్హత వివరాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook