రాజస్తాన్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కు ఊరట లభించింది. రెబెల్ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశించడంతో సచిన్ పైలట్ ఊపిరి పీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభానికి కారణమైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్ కు ఇప్పుడు కాస్త రిలాక్స్ లభించనట్టైంది. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి కారణం. ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన డిప్యూటీ సీఎం, పీసీసీ ఛీఫ్ సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలపై రాజస్థాన్ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. విప్ ను ధిక్కరించారంటూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నోటీసులు  కూడా పంపించారు. దీనిపై కోర్టు మెట్లెక్కిన సచిన్ పైలట్ వర్గానికి కాస్త సంతృప్తి లభించే తీర్పు వచ్చింది. ఈ నెల 24 వరకూ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి  ఆదేశాలు జారీ చేసింది. Also read: Rajastan crisis: పైలట్ చేతుల్లో ఏం లేదు.. డ్రామా అంతా బీజేపిదే: అశోక్ గెహ్లట్


నిబంధనలు అనుసరించకుండా తమకు నోటీసులు అందించారనేది అసమ్మతి ఎమ్మెల్యేల వాదనగా ఉంది. హైకోర్టు తీర్పుతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభం తెరపడటానికి మరి కొన్నిరోజులు పట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా సచిన్ పైలట్ పై చేసిన వ్యాఖ్యలు మొత్తం వ్యవహారాన్ని ఇంకా వేడెక్కిస్తున్నాయి.