Harassing College Student: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పాఠాలు నేర్పించడంతోపాటు, మంచి నడవడిక నేర్పిస్తారని స్కూల్ లకు పంపిస్తుంటారు. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు క్లాసు రూమ్ పాఠాలు చక్కగా బోధిస్తుంటారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మరికొందరు ఉపాధ్యాయులు దీనికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో కూడా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన స్కూల్ లలో కూడా అమానుష సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులకు సరైన మార్గం చూపాల్సిన ఉపాధ్యాయులు, లెక్యరర్ లు బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు. కొంతమంది టీచర్లు.. బాలికలను వేధించడం, అసభ్యంగా మెసెజ్ లు పంపడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూర్తి వివరాలు..


రాజస్థాన్ లోని బరన్ జిల్లాలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 11వ తరగతి బాలికపై, అదే కాలేజీలోని లెక్చరర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక పురుగుల మందుతాగి సూసైడ్ కు ప్రయత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు ప్రకారం.. జనవరి 12న విద్యార్థిని కాలేజీలోని క్లాసు లో చదువుకుంటుంది. అప్పటికి మిగతా స్టూడెంట్ ఎవరు రాలేదు. అప్పుడు..అదే కాలేజీలోని గణితం బోధించే లెక్చరర్ ఆమెదగ్గరకు వెళ్లాడు. ఆతర్వాత విద్యార్థిని పట్ల అసభ్యంగా మాట్లాడుతూ.. కౌగిలించుకుని అత్యాచారానికి యత్నించాడు. విద్యార్థిని లెక్చరర్ బారినుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది.


అంతే కాకుండా.. తన గదిలోకి వెళ్లి ఎవరితో మాట్లాడకుండా షాకింగ్ లో ఉండిపోయింది. ఆ తర్వాత.. ఒక్కసారిగా.. పురుగుల మందుతాగి సూసైడ్ కు ప్రయత్నించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఆమె అరవడం గమనించి ఆస్పత్రికి తరలించారు. బాలిక.. ఆస్పత్రిలో షాకింగ్ నుంచి కోలుకున్నాక.. జరిగిన విషయంను కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు కాలేజీ లెక్చరర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు లెక్చరర్ ను అదుపులోకి తీసుకున్నారు. 


ఘటనపై తీవ్ర దుమారం చెలరేగడంతో దీనికి ఉన్నతాధికారులు కూడా స్పందించారు.  అఘాయిత్యానికి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒమేంద్ర సింగ్ షెకావత్ పోలీసులను ఆదేశించారు. యువతి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు కాలేజీ దగ్గరకు చేరుకుని, లెక్చరర్ను, కాలేజీ యాజమాన్యంకు వ్యతిరేకంగా నిరసనలను చేపట్టారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 


Read Also: Ayodhya: భవ్యరామమందిరం ప్రారంభోత్సవం.. ముస్లిం ఫ్యామిలీ తమ బాలుడికి ఏంపేరు పెట్టారో తెలుసా..?


Read Also: Ayodhya Devotee Suffer Heart Attack: అయోధ్య ఆలయంలో కుప్పకూలిన భక్తుడు .. రక్షించిన భారత వాయుసేన


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook