Rajasthan political crisis: రాజస్థాన్‌లో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నా దానిపై హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. సీఎల్పీ సమావేశానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం అశోక్‌ గహ్లోత్‌ అనుకూల ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి ఇంటికి వెళ్లి... దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించినట్లు సమాచారం. తాజా పరిణామాలతో ఎడారి రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆదివారం సీఎల్పీ సమావేశం జరగాల్సి ఉంది. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని గహ్లోత్‌ చేపడితే ఆయన స్థానంలో సీఎం ఎవరనేది నిర్ణయించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హైకమాండ్ పరిశీలకులుగా జైపుర్‌ వచ్చిన మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకన్‌లు చాలాసేపు వేచి చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో చివరకు సమావేశం జరగలేదు. కాగా, ఈ రాత్రికి మేము ఢిల్లీకి తిరిగి వెళ్లడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చిన తర్వాతే ఢిల్లీకి తిరిగి వెళ్తామని ఆయన అన్నారు. దీని కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో విడివిడిగానైనా చర్చలు జరుపుతామని ఆయన అన్నారు. 


ఎమ్మెల్యేలు కోపంతో ఉన్నారనీ, ఇక తన చేతిలో ఏమీ లేదని హైకమాండ్ కు గహ్లోత్‌ తేల్చిచెప్పినట్లు సమచారం. రాజస్థాన్ లో రాజకీయ సంకోభ నేపథ్యంలో గహ్లోత్‌, పైలట్‌లను దిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. 



Also Read: Chandigarh Airport: చంఢీగఢ్‌ ఎయిర్​పోర్ట్​కు భగత్‌సింగ్‌ పేరు...మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ ప్రకటన 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook