రజినీకాంత్ పొలిటికల్ వెబ్సైట్ ప్రారంభం
రజినీకాంత్ పొలిటికల్ వెబ్సైటు ను ప్రారంభించారు. ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్నా అని చెప్పిన 24 గంటల్లోనే చకచకా దూసుకెళ్తున్నారు.
రజినీకాంత్ పొలిటికల్ వెబ్సైటు ను ప్రారంభించారు. ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్నా అని చెప్పిన 24 గంటల్లోనే చకచకా దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో సమకాలీన రాజకీయాలకు దీటుగా రాటుతేలడానికి సిద్దమయ్యారు తలైవా.
సోమవారం.. న్యూ ఇయర్ సందర్భంగా వెబ్సైటు, యాప్ ను లాంఛ్ చేస్తూ అభిమానులను, కార్యకర్తలను, తమిళ ప్రజలను ఆహ్వానించారు.
వెబ్సైటు పేరు 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.రజినీమండ్రన్.ఆర్గ్'. ఇందులో రజినీ ప్రసంగం ఉంటుంది. రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించిన తమిళ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మార్పు కోసం తమిళప్రజలు, అభిమానులు ఒకేతాటిపైకి వచ్చి.. స్వచ్ఛందంగా వాలంటీర్లుగా చేరాలని కోరారు. పార్టీ మొబైల్ యాప్ పేరు కూడా 'రజినీమండ్రన్' అని ఉండటం గమనార్హం. ఈయన ఆదివారం రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడంతో.. రెండు దశాబ్దాల ఊహాగానాలకు తెరపడినట్లయింది.