సిక్కు వ్యతిరేక అల్లర్లతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ప్రతినిధి తేజిందర్ పాల్ సింగ్ బగ్గా కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలోని అనేక చోట్ల 'మూక దాడులకు రాజీవ్ గాంధీ తండ్రి' అని హోర్డింగులు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. అందులో ఆయన 'అవును.. మూక దాడులకు రాజీవ్ గాంధీ తండ్రి' అని వ్యాఖ్యానించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


గతవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 1984లో కాంగ్రెస్ పార్టీ సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొనలేదన్నారు. 1984లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం అధికారంలో ఉన్నప్పుడు సుమారు 3000 మంది సిక్కులు చనిపోయారు. దేశరాజధాని ఢిల్లీలో సిక్కులు  ఎక్కువ సంఖ్యలో చనిపోయారు.


మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు చాలా విషాదకరమని.. అయితే ఇందులో కాంగ్రెస్ పాత్ర ఉందన్న వాదనతో తానూ ఏకీభవించని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్‌కు మద్దతుగా సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నారని.. పార్టీతో ఇందుకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.