Rajkot Couple sexually assault, kill 16 month old daughter in Secunderabad : ఒక పసి కందుపై కన్న తండ్రే దారుణానికి పాల్పడ్డాడు. ముక్కుపచ్చలారని కన్న కూతురిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా గొంతు నులిమి చంపాడు. 16 నెలల చిన్నారిపై (16 month old daughter) ఈ అఘాయిత్యం జరిగింది. ఇక ఈ ఘాతుకానికి ఆ పసికందు తల్లి (Mother) కూడా సహకరించింది. ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరూ చిన్నారి మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లాలని రైలు (Train) ఎక్కారు. ట్రైన్‌లో ప్రయాణికులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిందితులు 16 నెలల పసికందు మృతదేహాన్ని (Dead body) తీసుకుని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు రైలులో బయల్దేరారు. అయితే మహారాష్ట్రలోని (Maharashtra) షోలాపూర్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందడంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 


గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు (Rajkot) చెందిన దంపతులు సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కన్నకూతురిపై 26 ఏళ్ల తండ్రి ఈ నెల 3 వ తేదీన ఇంట్లో లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘోరం తల్లి ఎదుటే జరిగినా.. ఆమె కూడా ఇందుకు సహకరించింది. 


తర్వాత ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని రాజ్‌కోట్‌కు తీసుళ్లాలని స్కెచ్ వేసుకున్నారు. సికింద్రాబాద్‌లో (Secunderabad) రాజ్‌కోట్‌కు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు. అయితే పాపలో చలనం లేకపోవడం, ఆ దంపతులు ఇద్దరూ అనుమానస్పదంగా ఉండడంతో తోటి ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటేనే ప్రయాణికులు టీటీఈకి సమాచారం ఇచ్చారు. ఆయన రైల్వే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. దీంతో వారిని రైలు నుంచి షోలాపూర్‌లో దింపేశారు. నిందితులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు (Cases) నమోదు చేశారు.


Also Read : Omicron Wave: వచ్చే నెలలో భారత్‌లో కరోనా పీక్స్‌కి.. డెల్టా పీక్‌ని మించి...


ఇక మరో ఘటనలో కొడుకుపై తండ్రే లైంగిక దాడికి పాల్పడున్నట్లు పోలీసులకు (police) ఫిర్యాదు అందింది. కన్న కొడుకును తండ్రి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ తల్లి ఫిర్యాదు చేసింది. ఉప్పల్‌కు చెందిన జంటకు 11 సంవత్సరాల క్రితం పెళ్లి అయింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భేదాభిప్రాయాలు వచ్చి వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు బాబుని కొన్ని రోజులు తండ్రి వద్దే ఉంచారు. తండ్రి ఆ అబ్బాయిని తరుచుగా లైంగికంగా వేధించాడని (Sexually harassed) తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు (Police) కేసు (Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Also Read : Corona cases in India: దేశంలో కొవిడ్ కల్లోలం- కొత్తగా 1,41,986 కేసులు నమోదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook