కోరిక తీర్చాలని కోడలికి వేధింపులు... విషయం బయటకు పొక్కడంతో దారుణానికి ఒడిగట్టిన మామ...

Man murdered his daughter in law: వావి వరసలు మరిచి తన కోరిక తీర్చాలంటూ కోడలిని వేధించిన ఓ మామ... చివరకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. విషయం కుటుంబ సభ్యులతో చెప్పినందుకు ఆమెను పగబట్టి హత్యకు పాల్పడ్డాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 02:51 PM IST
  • మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం
  • కోడలిని లైంగికంగా వేధించిన మామ
  • కుటుంబ సభ్యులతో చెప్పినందుకు ఆమెపై పగబట్టిన మామ
  • కత్తితో గొంతు కోసి హతమార్చిన వైనం
కోరిక తీర్చాలని కోడలికి వేధింపులు... విషయం బయటకు పొక్కడంతో దారుణానికి ఒడిగట్టిన మామ...

Man murdered his daughter in law: మహబూబ్‌నగర్ జిల్లాలో (Mahbubnagar) దారుణం జరిగింది. కోడలిపై ఓ మామ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విషయం కుటుంబ సభ్యులతో చెప్పినందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం సోమ్లా తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సోమ్లా తండాలో చాలాకాలంగా ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటి పెద్ద ఇటీవల తన కోడలిపై కన్నేశాడు. అప్పటినుంచి ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె వద్దకు వెళ్లి కోరిక తీర్చాలని వేధించేవాడు. మామ వేధింపులు రోజురోజుకు ఎక్కువవడటంతో... విషయాన్ని ఆమె తన భర్త, కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో భర్త, కుటుంబ సభ్యులు కలిసి అతన్ని చితకబాదారు. మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని గట్టిగా హెచ్చరించారు.

కుటుంబ సభ్యులు చితక్కొట్టినా సరే అతని బుద్ది మాత్రం మారలేదు. పైగా కోడలిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇటీవల ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగొచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

గతేడాది మార్చిలో హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి (55), అతని కోడలు (21)తో కలిసి హైదరాబాద్ రాగా... నగరంలోని ఓ లాడ్జిలో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. వ్యాపార నిమిత్తం మామతో కలిసి హైదరాబాద్ వచ్చినందుకు తనపై అతను లైంగిక దాడికి (Sexual Assault) యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించారు.

Also Read: సభ్య సమాజం సిగ్గుపడే ఘటన.. వనమా రాఘవకు కేసీఆర్ అండదండలు..: పాల్వంచ ఘటనపై రేవంత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News