Rajya Sabha elections 2022: దేశంలో మరో ఎన్నికల సమరానికి తెరలేవనుంది. ఆరు రాష్ట్రాల పరిధిలోని 13 రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha elections 2022) మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. పంజాబ్‌లో 5, కేరళలో 3, అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర , నాగాలాండ్‌లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగున్నాయి.  ఆనంద్ శర్మ, ఏకే ఆంటోనీ, పర్తాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్ వంటి పలువురు నేతలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదవీ విరమణ చేయనున్న సభ్యుల పేర్లు: 
అస్సాం- రాణీ నరహ్, రిపున్ బోరా
హిమాచల్ ప్రదేశ్ - ఆనంద్ శర్మ
కేరళ- ఏకే ఆంటోని, ఎంవీ శ్రేయంస్‌ కుమార్‌, కె.సోమప్రసాద్‌ 
నాగాలాండ్‌ - కె.జి. కెన్యే 
త్రిపుర - జర్నా దాస్‌
పంజాబ్‌ - సుఖదేవ్‌ సింగ్‌, ప్రతాప్‌సింగ్‌ బజ్వా, శ్వైత్ మాలిక్, నరేశ్‌ గుజ్రాల్‌, శంషేర్‌ సింగ్‌ దుల్లో


ఎన్నికల షెడ్యూల్ (Election Schedule):
నోటిఫికేషన్‌ జారీ: 14 మార్చి, 2022
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ: మార్చి 21, 2022
నామినేషన్ల పరిశీలన: 22 మార్చి, 2022
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 24, 2022
పోలింగ్ తేదీ: 31 మార్చి, 2022
పోలింగ్ సమయం: ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు.
ఓట్ల లెక్కింపు: 31 మార్చి, 2022 సాయంత్రం 05:00 గంటలకు.


Also Read: Operation Ganga: ఆపరేషన్ గంగ అప్‌డేట్స్ వివరించిన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook