Rajya Sabha: రాజ్యసభ నూతన సెక్రటరీ జనరల్‌గా తెలుగు వ్యక్తి డాక్టర్‌ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు నియమితులయ్యారు. 2018 నుంచి రాజ్యసభ (Rajya Sabha)సచివాలయంలో కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆయన్ను... సభ అత్యున్నత స్థానంలో నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు (Chairman M. Venkaiah Naidu)మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దేశ్‌దీపక్‌ వర్మ (Deshdeepak Verma)పదవీ విరమణ చేయడంతో రామాచార్యుల(ramacharyulu)ను నియమించారు. రాజ్యసభ సచివాలయంలో పనిచేసే ఉద్యోగి సెక్రటరీ జనరల్‌ పదవి చేపట్టడం గత 70 ఏళ్లలో ఇదే తొలిసారి. లోక్‌సభ(Lok Sabha) ఉద్యోగులు 9 మంది ఈ అత్యున్నత స్థానానికి చేరినా, రాజ్యసభలో మాత్రం ఇదే ప్రథమం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేపథ్యం..
కృష్ణా జిల్లా(Krishna District)లోని పెనమలూరు మండలం, వేల్పూరు గ్రామంలో 1958 మార్చి 20న రామాచార్యులు జన్మించారు. 40 ఏళ్లుగా పార్లమెంటు(Parliament)లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1982 ఫిబ్రవరిలో తొలుత అసిస్టెంట్‌ హోదాలో ఏడాదిపాటు లోక్‌సభలో పనిచేశారు. తర్వాత 1983 మేలో రాజ్యసభ సెక్రటేరియట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో చేరారు. డిగ్రీ వరకు విజయవాడ(Vijayawada)లోనే విద్యాభ్యాసం చేశారు. తిరుపతి(Tirupathi)లో రాజనీతిశాస్త్రంలో ఎంఏ చదివారు. 


Also Read: India-Afghanistan: తాలిబన్లతో ఇండియా రాయబారి దీపక్ మిట్టల్ చర్చలు


పార్లమెంటులో ఉద్యోగం చేస్తూనే దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ‘భారత పార్లమెంటు, అమెరికా కాంగ్రెస్‌లో కమిటీల వ్యవస్థ, రెండింటి మధ్య సారూప్యత’పై చేసిన పరిశోధనకు 2005లో దిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌(Doctorate) ప్రదానం చేసింది. 2017లో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక కార్యదర్శిగానూ రామాచార్యులు సేవలందించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook