పెగసస్‌పై చర్చకు పట్టుబడిన విపక్షాలు, రాజ్యసభ వాయిదా
Rajyasabha Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన, పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడటం ప్రధానంగా సాగింది.
Rajyasabha Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన, పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడటం ప్రధానంగా సాగింది.
జూలై 19వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament monsoon session)హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య అధికారపార్టీ పలు బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించుకుంటోంది. లోక్‌సభలో విపక్ష ఎంపీల నిరసన నేపధ్యంలో సభ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ప్రతిపక్షాల ఆందోళన నేపధ్యంలో రాజ్యసభ రేపటికి అంటే మంగళవారానికి వాయిదా పడింది. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు పెద్దఎత్తున రాజ్యసభ(Rajyasabha)లో నినాదాలు చేశారు.మరోవైపు రాజ్యసభలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవి సింధూకు అభినందనల అనంతరం పెగసస్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ అంశంపై వరుసగా ఐదవ రోజు నిరసన కొనసాగింది. చర్చ లేకుండానే బిల్లుల్ని ఆమోదిస్తున్నారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అటు లోక్‌సభలో పోలవరం అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని వైసీపీ ఎంపీ స్పీకర్‌కు నోటీసు అందించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా లోక్‌సభలో చర్చకొచ్చింది. ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం(Central government)స్పష్టం చేసింది.
Also read: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందంటున్న కేంద్ర ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook