Gujarat Road Accident: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆటో, బైక్‌లను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు, బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో  ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ముగ్గురు రాఖీ పండగ సందర్భంగా తమ సోదరుల ఇంటికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదంలో మృతి చెందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదానికి కారణమైన కారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ మాధాభాయ్ అల్లుడు ఖేతన్ పధియార్‌ది కావడం గమనార్హం. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆనంద్ పట్టణం నుంచి తారాపూర్‌కి వెళ్లే సోజిత్రా హైవేపై గురువారం (ఆగస్టు 11) రాత్రి 7గం. సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైవేపై అతివేగంతో దూసుకొచ్చిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఒక ఆటోను, బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. 


మృతులను జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వీణాబెన్ మిస్త్రీ, యాసన్ వోహ్రా, యోగేశ్, సందీప్‌లుగా గుర్తించారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఖేతన్ కూడా స్వల్పంగా గాయపడటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.


ఈ ప్రమాద ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కాంగ్రెస్ అసలు స్వరూపం ఇదేనంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విరుచుకుపడ్డారు. ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఖేతన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.



Also Read: TS Eamcet 2022 Result: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడే..! విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..


Also Read: Chiranjeevi: చిరంజీవి ప్రమోట్ చేస్తే సినిమా ఫట్టేనా.. అసలేమవుతోంది?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook