Ayodhya: ఘనంగా జరిగిన భూమిపూజ
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయ శంకుస్థాపనకు భూమిపూజ అత్యంత ఘనంగా కొనసాగింది. భూమిపూజలో భాగంగా ఏర్పాటైన శిలాపూజలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మక రామ జన్మభూమి ఆలయ శంకుస్థాపనకు భూమిపూజ అత్యంత ఘనంగా కొనసాగింది. భూమిపూజలో భాగంగా ఏర్పాటైన శిలాపూజలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయనతో పాటు 17 మంది వేదికపై ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్ భూమిపూజలో పాల్గొన్నారు. పండితుల వేదమంత్రోఛ్చారణల మద్య అత్యంత ఘనంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శంకుస్థాపన కార్యక్రమం కొనసాగింది. మోదీ చేరుకోడానికి ముందే భూమిపూజ ఏర్పాట్లను పూర్తి చేశారు. భూమి పూజ కోసం 9 ఇటుకల్ని వినియోగించారు. 1989 సమయంలో ఈ ఇటుకల్నిభక్తులు వివిధ ప్రాంతాల్నించి పంపించారు. ఇటువంటి ఇటుకలు దాదాపు 2 లక్షల 75 వేలు చేరుకున్నాయి. జలపుష్పాలతో మోదీ పూజలు చేశారు. మోదీతో సంకల్పం చదివించారు పండితులు. Also read: Asaduddin Owaisi: రామ మందిరం భూమి పూజ.. అసదుద్దీన్ సంచలన ట్వీట్