Karnataka BJP demands D K Shivakumar's resignation: బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మాజీ మంత్రి రమేష్ జర్కిహోలికి సంబంధించిన సెక్స్ స్కాండల్ వీడియోలో కనిపించిన మహిళ తన కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డికే శివకుమార్‌ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పిన ఆడియో టేప్ (Audio tapes leaked) బయటికి లీక్ అయింది. శివకుమార్‌ని కలిసేందుకు వెళ్లానని, కానీ ఆయన్ని కలిసేందుకు అవకాశం లభించలేదని సదరు మహిళ తన కుటుంబసభ్యులతో చెప్పుకుంటున్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. దీంతో ఆ సెక్స్ స్కాండల్ వివాదాన్ని డికే శివకుమార్‌కి ముడిపెడుతూ కర్ణాటకలోని బీజేపి నేతలు ఆయనపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని Karnataka BJP డిమాండ్ చేసింది. శివకుమార్ తన పీసీసీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని అధికార పార్టీ నేతలు పట్టుబట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనపై కర్ణాటకలోని బీజేపి నేతలు చేస్తున్న ఆరోపణలు, డిమాండ్లపై తాజాగా డికే శివకుమార్ స్పందిస్తూ.. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ కలవలేదు కూడా అని అన్నారు. ఈ వివాదంపై శివ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. '' ప్రజల మధ్య మీ మీడియా ఎలాగైతే వారధిగా నిలుస్తుందో ప్రజా జీవితంలో ఉన్న మాలాంటి నేతలు కూడా అలాగే సమస్యల్లో ఉన్న ప్రజల కష్టాలు తీరుస్తుంటాం. నిత్యం కనీసం 10 మంది జనం తమ కష్టాలు చెప్పుకోవడానికి తనను కలవడానికి వస్తుంటారని, అలాగే ఆ మహిళ కూడా తనను కలవడానికి వచ్చి ఉండి ఉంటారేమో'' అని అభిప్రాయపడ్డారు. 


Also : Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ ? స్పందించిన మంత్రి Satyendar Jain


ఒకవేళ ఆ మహిళ ఇవాళ తనను కలవడానికి వచ్చినా కూడా ఎవరు, ఏం సమస్య అనే వివరాలు కనుక్కుంటానని డికె శివకుమార్ (DK Shivakumar) చెప్పుకొచ్చారు. ఆ మహిళ శివకుమార్ పేరు ప్రస్తావించినట్టుగా లీక్ అయిన ఆడియో (Audio leaked) విషయానికొస్తే... సెక్స్ స్కాండల్ వీడియో టీవీ ఛానెల్స్‌కి లీకైన (scandal video leaked) రోజు రాత్రే ( మార్చి 2న) ఆమె తన కుటుంబంతో ఫోన్‌లో సంభాషించినప్పటి ఆడియో అయ్యుంటుందని తెలుస్తోంది. ఏదేమైనా రమేష్ జర్కిహోళి సెక్స్ స్కాండల్ వీడియో కర్ణాటక రాజకీయాల్లో (Karnataka politics) పెను సంచలనం సృష్టించడమే కాకుండా అనేక ఇతర వివాదాలకు కూడా దారితీసింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook