Ravindranath Tagore: జనగణమణ గేయ రచయిత, నోబుల్ బహుమతి విజేత విశ్వకవి రవీంద్రుని ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇళ్లు అమ్మకానికొచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్(Ravndranath Tagore). జగమెరిగిన కవి. జనగణమంటూ గుండెల్లో దేశభక్తిని రగిలించిన మహనీయుడు. ఎక్కడ నా దేశం స్వేచ్ఛగా మనగలుగుతుందో అంటూ నినదించిన కవి. పశ్చిమ బెంగాల్‌లో రవీంద్రుని శాంతినికేతన్ అందరికీ సుపరిచితమే. ఆ మహాకవి ఇళ్లు ఇప్పుడు అమ్మాకనికి వచ్చింది. అయితే ఇండియాలో ఇళ్లు కానేకాదు. లండన్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ కొంతకాలం నివసించిన గృహమిది. 1912లో గీతాంజలిని ఇంగ్లీషులో అనువదించినప్పుడు కొద్దికాలం లండన్ హాంపస్డెట్ హీత్‌లోని హీత్‌విల్లాలో నివసించారు. అందుకే ఈ విల్లాకు ప్రాముఖ్యత పెరిగింది. 


2015, 2017లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)యూకేను సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. లండన్‌లోని భారత హై కమీషనర్‌తో చర్చించారు కూడా. ఠాగూర్ నివసించిన ఆ ఇంటిని ఓ మ్యూజియంగా మార్చాలనేది ఆమె కోరిక. వినియోగదారులు అత్యధిక విలువను పొందడమే తమ లక్ష్యమని..బ్రిటీష్ చట్టాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తే తమకే అభ్యంతరం లేదని ఎస్టేట్ ఎజెంట్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ విల్లా కొనుగోలుకు బెంగాల్ ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం(Central government) గానీ ఆసక్తి వ్యక్తం చేయలేదని లండన్‌లోని భారత హైకమీషనర్ తెలిపారు. 


Also read: Gautam Gambhir Case: గౌతమ్ గంభీర్ కోవిడ్ మందుల నిల్వ కేసులో స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook