West Bengal: బెంగాల్ ఎన్నికలతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడు దశాబ్దాలపాటు అప్రతిహంగా పాలించిన లెఫ్ట్ ఫ్రంట్ నేడు ఉనికి లేకుండా పోయింది. వామపక్షాల పోరాట పంథాను వణికి పుచ్చుకున్న దీదీ..బెంగాలీల మనసు గెల్చుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బెంగాల్(West Bengal). ఒకప్పుడు వామపక్షాల కంచుకోట. మూడు దశాబ్దాలకు పైగా రాజ్యమేలిన పార్టీలు నేడు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని ఒక్క సీటు కూడా గెలవలేని స్థితికి చేరుకున్నాయి. 1977 నుంచి 2011 వరకూ 34 ఏళ్ల పాటు నిరంతరాయంగా బెంగాల్ కోటను పాలించిన కమ్యూనిస్టులు( Communist parties)..ఘోర ఓటమి పాలయ్యారు. కమ్యూనిస్టుల పోరాట పంథాను అలవర్చుకున్న బెంగాలీ టైగర్ మమతా బెనర్జీ ( Mamata Banerjee) బెంగాలీల మనసు గెల్చుకున్నారు. 


బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్‌( Left Front) లోని ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలు కలిసి బెంగాల్‌లో 50.7 ఓట్లు సాధించాయి. అటు 2009 ఎన్నికల్లో 43.3 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. 2007లో జరిగిన నందిగ్రామ్(Nandigram)భూ సేకరణ వ్యతిరేక పోరాటంలో టీఎంసీ ( TMC) అధినేత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee) కీలకంగా వ్యవహరించినప్పటి నుంచి కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైంది. 2008లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్ ఉద్యమం  ( Nandigram Movement) రాష్ట్రంలో కమ్యూనిజం దూరం కావడానికి దోహదపడింది. 2011లో సీపీఐ 2, సీపీఎం 40 స్థానాల్ని మాత్రమే గెల్చుకోగలిగాయి. అప్పుడు తొలిసారి టీఎంసీ అధికారంలో వచ్చింది. ఆ తరువాత 2016 ఎన్నికల్లో సీపీఐ 1, సీపీఎం 26 స్థానాలకు పడిపోయాయి. మరోసారి టీఎంసీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి కేవలం 2 సీట్లు గెల్చుకోగా..2019 ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడింది. 


2008లో ఇండియా-అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో..కాంగ్రెస్ పార్టీ (Congress party) టీఎంసీతో జత చేరింది. అప్పట్నించి కమ్యూనిజం పతనం ప్రారంభమైంది పశ్చిమ బెంగాల్‌లో. నేడు ఒక్క సీటు కూడా గెల్చుకోలేని పరిస్థితికి చేరింది.


Also read: Kerala Assembly Election 2021: కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు.. కీలక నేతలు, ప్రముఖుల గెలుపు, ఓటములు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook