JioPhone Next 4G smartphone launched at Reliance AGM 2021: ముంబై: రిలయన్స్ నుంచి జియోఫోన్ నెక్ట్స్ పేరిట మరో 4G స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని (Mukesh Ambani) ప్రకటించారు. నేడు వర్చువల్ పద్ధతిలో జరిగిన రిలయన్స్ 44వ యాన్వల్ జనరల్ మీటింగ్‌ వేదికగా ముఖేష్ అంబాని ఈ ప్రకటన చేశారు. గూగుల్‌తో కలిసి రిలయన్స్ సంస్థ (Reliance, Google) ఈ జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్‌ని డెవలప్ చేశామని, సెప్టెంబర్ 10న జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని ముఖేష్ అంబాని తెలిపారు. అత్యంత తక్కువ ధరలో అన్ని యాప్స్‌ని సపోర్ట్ చేసే విధంగా ఈ స్మార్ట్ ఫోన్‌ని తయారు చేసినట్టు ముకేష్ అంబానీ స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే రిలయన్స్ జియో (Reliance Jio) రాకతో 4G బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో ఓ పెను విప్లవం సృష్టించిన రిలయన్స్.. తాజాగా ప్రవేశపెట్టిన జియోఫోన్ నెక్ట్స్ తో 4జీ మార్కెట్ లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 4G బేసిక్ మోడల్ ఫోన్ కొనుగోలు చేసేంత స్తోమత లేని కారణంగా ఇప్పటికీ ఇండియాలో మరో 300 మిలియన్ల మంది 2G సేవలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని, అటువంటి వారికి 2జీ నుంచి విముక్తి కల్పించేందుకే ఈ జియోఫోన్ నెక్ట్స్ తయారు చేసినట్టు రిలయన్స్ అధినేత ముకేష్ అంబాని తెలిపారు.


Also read : Vistara flights tickets offers: రూ.1099కే domestic flights టికెట్ బుకింగ్ ఆఫర్స్


గూగుల్ ప్లేస్టోర్ (Google play store) నుంచి జియో స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకునే విధంగా రిలయన్స్, గూగుల్ కలిసి ఈ జియోఫోన్ రూపొందించినట్టు ముకేష్ అంబానీ పేర్కొన్నారు.  


వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ ఆటోమేటిక్ రీడింగ్, భాషా అనువాదం, స్మార్ట్ కెమెరా (voice assistant, automatic read-aloud of screen text, language translation, smart camera) లాంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్స్ ఈ జియోఫోన్ నెక్ట్స్ సొంతం అని రిలయన్స్ ప్రకటించింది.


Also read : EPFO ​​Latest Update: పీఎఫ్ ఖాతా, పెన్షన్ ఫండ్ వేరు చేయాలని యోచిస్తున్న కేంద్రం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook