రిలయన్స్ కమ్యునికేషన్స్ మూసేస్తున్న అంబాని !
రిలయన్స్ కమ్యునికేషన్స్ వ్యాపారాన్ని పూర్తిగా మూసేయనున్నట్టు ప్రకటించిన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యునికేషన్స్ (ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యునికేషన్స్ వ్యాపారాన్ని పూర్తిగా మూసేయనున్నట్టు అనిల్ అంబానీ ప్రకటించారు. ఓవైపు రిలయన్స్ కమ్యునికేషన్స్ అప్పుల్లో కూరుకుపోవడం ఓ కారణమైతే, రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టిసారించాలనుకోవడం తమ నిర్ణయం వెనుకున్న మరో కారణం అని ఈ సందర్భంగా అనిల్ అంబానీ వెల్లడించారు. అతి చవకగా టెలికం సేవలను అందించాలనే లక్ష్యంతో 2000 సంవత్సరంలో ఆర్‌కామ్‌ను ప్రారంభించామని, అయితే, ప్రస్తుతం కంపెనీ రూ.40 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అనిల్ అంబానీ స్పష్టంచేశారు.
రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన వ్యాపార అవకాశాలు ఉన్నందున ఆ వ్యాపారంపై దృష్టిసారించాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు అనిల్ అంబానీ వెల్లడించారు.