Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకు వస్తున్న మెయిల్ బెదిరింపులు కలవరం రేపుతున్నాయి. ఒకదానివెంట ఒకటిగా రెండు సార్లు ఒకే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. వరుసగా రెండ్రోజులు రెండు సార్లు చంపేస్తామని బెదిరిస్తూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. షాదాబ్ బాద్ అనే వ్యక్తి నుంచి మొన్న శుక్రవారం రాత్రి ముకేశ్ అంబానీ సంస్థకు చెందిన ఓ మెయిల్ ఐడీకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తమ వద్ద బెస్ట్ షూటర్లు ఉన్నారని, 20 కోట్లు చెల్లించకపోతే చంపేస్తామని ఆ మెయిల్ ద్వారా బెదిరించాడు అగంతకుడు. ఈ మెయిల్ బెదిరింపుపై ముకేశ్ అంబానీ సెక్యూరిటీ విభాగం ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా, గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 387, 506(2) కింద కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


ఈలోగా అదే వ్యక్తి మెయిల్ ఐడీ నుంచి మరో బెదిరింపు మెయిల్ నిన్న శనివారం వచ్చింది. తమ మొదటి మెయిల్‌కు స్పందించనందుకు ఈసారి 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరో మెయిల్ చేశాడు ఆ అగంతకుడు. వరుసగా రెండవసారి బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పబ్లిక్ వైఫై నుంచే ఆ అగంతకుడు మెయిల్ చేశాడని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. అందుకే ఎవరనేది తెలుసుకోవడం కష్టమౌతోంది. 


ప్రస్తుతం ముకేశ్ అంబానీకు జడ్ ప్లస్ భద్రత ఉంది. గతంలో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ నుంచి బెదిరింపు రావడంతో 2013లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంబానీకు ఈ భద్రత కల్పించింది. అంబానీ రక్షణ వ్యవస్థలో 50 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలుంటారు. వీరికితోడు 15-20 మంది వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అంబానీ భద్రతా వ్యవస్థ చీమ కూడా దూరనంతగా ఉంటుంది. 


Also read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. కేంద్రం భారీ ప్రకటన.. ఈ నిబంధనల్లో మార్పులు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook