Rent Agreement: రెంటల్ అగ్రిమెంట్ తయారీలో తప్పకుండా ఉండాల్సిన అంశాలేవి
Rent Agreement: ఇళ్లు అద్దెకు తీసుకునేటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ చేస్తుంటాం. ఇంటి ఓనర్, అద్దెకు దిగేవారి మధ్య ఒప్పంద పత్రం అది. చాలామందికి రెంటల్ అగ్రిమెంట్‌కు ఉన్న ప్రాముఖ్యత తెలియదు. కానీ రెంటల్ అగ్రిమెంట్ చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా పరిగణలో తీసుకోవల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
Rent Agreement: అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో కొన్ని విషయాలు తప్పకుండా ప్రస్తావించాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. రెంటల్ అగ్రిమెంట్‌లో సాధారణంగా అద్దె ఎంత, ఎప్పుడు ఇవ్వాలి, అగ్రిమెంట్ సమయం అనేది చాలా కీలకం. ఈ విషయాలు అగ్రిమెంట్‌లో తప్పకుండా ఉండాలి.
చిన్న చిన్న ఊర్లలో రెంటల్ అగ్రిమెంట్ లేకుండానే ఇళ్లు అద్దెకు ఇస్తుంటారు. తీసుకుంటుంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఇళ్లు అద్దెకు ఇవ్వాలన్నా లేక తీసుకోవాలన్నా ఇరువురి మధ్య రెంటల్ అగ్రిమెంట్ తప్పకుండా ఉండాలి. మెట్రో నగరాల్లో ఈ పద్ధతి తప్పకుండా కొనసాగుతుంటుంది. అయితే ఈ రెంటల్ అగ్రిమెంట్ తయారు చేసేటప్పుడు కొన్ని విషయాలు మర్చిపోకూడదు. అద్దె ఎంత, అద్దె చెల్లించాల్సిన తేదీ, ఒప్పంద కాలం అనేది తప్పకుండా ఉండాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
అగ్రిమెంట్‌లో సంతకం చేసేముందు ఈ వివరాలు ఉన్నాయో లేవే ఓ సారి చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఏయే వివరాలు ఉన్నాయి ఏవి లేవనేది చూసుకోవాలి. అంటే ఉదాహరణకు మెయింటెనెన్స్ అందులో కలిపి ఉంటుందా లేక విడిగా ఉంటుందా అనేది అక్కడ వివరించాలి. ఇళ్లు అద్దెకు తీసుకునేముందు ఆ ఇంట్లో సామగ్రి ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా ఉండాలి. పార్కింగ్ ఛార్జి, విద్యుత్ ఛార్జి వంటి వివరాలు తప్పకుండా ఉండాలి. సాధారణంగా చాలామంది వీటిని తేలిగ్గా తీసుకుని వదిలేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.
అన్నింటికంటే ముఖ్యంగా అగ్రిమెంట్ ఎంత కాలం వర్తిస్తుందనేది ఉండాలి. ఒకవేళ అగ్రిమెంట్ 3-4 ఏళ్లకు రాసుకుంటే ఏడాదికి ఎంత పర్సంటేజ్ పెంచుతారనేది ప్రస్తావించాలి. ఒకవేళ అద్దెదారుడు లేదా ఇంటి ఓనర్ ఆ ఒప్పందాన్ని నిర్దేశిత సమయం కంటే ముందే బ్రేక్ చేయాలనుకుంటే నోటీస్ పీరియడ్ ఎంత అనేది ఉండాలి. ఒక నెల లేదా రెండు నెలల నోటీస్ పీరియడ్ ఇరువురికీ వర్తిస్తుంది. ఆ వివరాలు అగ్రిమెంట్‌లో ప్రస్తావించాలి. కొంతమంది ఇంటి ఓనర్లు పెట్ యానిమల్స్ లేదా బర్డ్స్ అనుమతించరు. కొంతమంది పార్కింగ్ లేదంటారు. ఇది ఎవరిష్టం వారిదే అయినా ఆ వివరాలు అగ్రిమెంట్‌లో తప్పకుండా ఉండాలి
Also read: SIP Tips: నెలకు 10 వేలతో 10 కోట్లు కూడబెట్టడం ఎలాగో తెలుసా, ఎన్నేళ్లు పడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.