రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సన్నద్ధమైంది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు పదిమంది ఆగ్నేయాసియా దేశాలకు అధినేతలు హాజరవుతుండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 


కాగా.. ఈ ఏడాది 2018 రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడొ, ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్ట్, బ్రునై సుల్తాన్ వద్దౌలా, లాఓస్ ప్రధాని సిసౌలిత్, వియత్నాం ప్రధాని గువెన్ గ్సువాన్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, సింగపూర్ ప్రధాని లే సైన్ లూన్గ్, ధాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓ-చా, మయన్మార్ ప్రధాని ఆంగ్ సాంగ్సూకీ,  కంబోడియా ప్రధాని హున్ సేన్ హాజరుకానున్నారు.