Republic day: విదేశీ అతిధి లేకుండానే గణతంత్ర దినోత్సవ వేడుకలు
Republic day: భారతదేశ రిపబ్లిక్ డే ఉత్సవాలు..జనవరి 26. సుదీర్ఘ కాలం తరువాత సాధారణంగా జరగనున్నాయి. విదేశీ అతిధుల ముచ్చట లేకుండానే పెరేడ్ సాగనుంది.
Republic day: భారతదేశ రిపబ్లిక్ డే ఉత్సవాలు..జనవరి 26. సుదీర్ఘ కాలం తరువాత సాధారణంగా జరగనున్నాయి. విదేశీ అతిధుల ముచ్చట లేకుండానే పెరేడ్ సాగనుంది.
రిపబ్లిక్ డే ఉత్సవాలు ( Republic day celebrations ) ప్రతియేటా అత్యంత ఘనంగా జరుగుతుంటాయి.ముఖ్యంగా విదేశీ అతిధిని ముఖ అతిధిగా ఆహ్వానించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. విదేశీ అతిధి సమక్షంలోనే పెరేడ్ ( Parade ) అత్యంత ఘనంగా జరుగుతుంంది. రిపబ్లిక్ డే ఉత్సవాలకు మరి కొద్దిరోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలకు విదేశీ అతిధులెవరూ రావడం లేదని..సాధారణంగానే జరుగుతాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు.
కోవిడ్ 19 మహమ్మారి ( Covid 19 pandemic ) కారణంగా రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరయ్యేందుకు విదేశీ అధినేతలు ముందుకు రాలేదని ఆయన వెల్లడించారు. వాస్తవానికి ఈసారి వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ( Britain pm Boris johnson ) ను ..నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) ఆహ్వానించారు. హాజరయ్యేందుకు బోరిస్ జాన్సన్ సైతం సమ్మతించారు. అయితే ఇటీవల బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమైన కరోనా కొత్త వైరస్ ( New coronavirus ) ఆ దేశాన్ని కకావికలం చేయడంతో..భారత పర్యటనను విరమించుకుంటూ సమాచారం అందించారు.
Also read: New Farm laws: సుప్రీం కమిటీ నుంచి తప్పుకున్న భూపిందర్ సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook