న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా నేడు ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద జరిగిన బీటింగ్ రిట్రీట్ సెరెమనీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకగా జరిగిన ఈ సెరెమనిలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం పాల్గొన్నారు.