Erra karam dosa: ఎర్ర కారం దోశ ఆంధ్ర స్టైల్ లో ఎంతో రుచిగా ఇలా తయారు చేసుకోవచ్చు..

Erra karam dosa Recipe: ఎర్ర కారం దోశలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సౌత్ ఇండియన్ లో ఎక్కువగా ఎర్రకారం దోశ ఆస్వాదిస్తారు. ఆంధ్ర స్టైల్ లో ఎర్రకారం దోశను ఇలా తయారు చేసుకుంటే మీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఎంతో రుచిగా ఉంటుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 13, 2024, 08:35 PM IST
Erra karam dosa: ఎర్ర కారం దోశ ఆంధ్ర స్టైల్ లో ఎంతో రుచిగా ఇలా తయారు చేసుకోవచ్చు..

Erra karam dosa Recipe: ఎర్ర కారం దోశలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సౌత్ ఇండియన్ లో ఎక్కువగా ఎర్రకారం దోశ ఆస్వాదిస్తారు. ఆంధ్ర స్టైల్ లో ఎర్రకారం దోశను ఇలా తయారు చేసుకుంటే మీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఎంతో రుచిగా ఉంటుంది. ఇది మంచి స్నాక్ ఆప్షన్ లా కూడా తీసుకోవచ్చు.ఎర్ర కారం దోశ ఆంధ్ర స్టైల్ లో స్పైసీగా చట్నీ తో పాటు తీసుకుంటే రుచి అదిరిపోతుంది. ఇందులో రెడ్ చిల్లి పేస్టులా వేసుకొని దోశ తయారు చేసుకుంటారు. పండు మిరపకాయలు, వెల్లుల్లి ఇతర మసాలాలతో తయారు చేస్తే ఈ ఎర్ర కారం పొడి డిష్ కి మంచి ఆరోమా ఇవ్వడంతో పాటు ఎంతో హెల్తీ. ఎర్ర కారం దోస రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.  దీన్ని ఒక బ్లెండర్ లో వేసి నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి రెబ్బలు ,ఉప్పు కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి.

మంచి పేస్ట్ మాదిరి అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి ఎర్ర కారం చట్నీ మాదిరి వచ్చేలా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీడియం హీట్ లో పెట్టి అందులో దోశ బ్యాటర్ వేసుకొని దోశ వేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా దోస చుట్టూ పోసుకోవాలి. దోస చివర్లు గోల్డెన్ రంగులోకి క్రిస్పీగా వచ్చేవరకు చూసి ఆ తర్వాత దోస పైనుంచి ఈ ఎర్ర కారం మొత్తానికి పేస్టులా అప్లై చేయాలి.

ఇదీ చదవండి: లవంగం ఇలా తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు.. అది ఎలానో తెలుసా?

 మరింత రుచి కావాలంటే పైనుంచి కాస్త ఉప్పు కూడా చల్లుకోండి ఓ నిమిషం పాటు దోసను వేయించాక ఇది క్రిస్పీగా ఎర్ర కారం దోస రెడీ అవుతుంది. దోసను ఫోల్డ్ చేసి మరో కొద్దిసేపు కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రుచికరమైన వేడివేడి ఎర్ర కారం దోసను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా సాంబార్లో నంజుకుని తింటే రుచి అదిరిపోతుంది.

ఇదీ చదవండి:  ఈ ఒక్క కొరియన్ బెల్లీఫ్యాట్‌ డ్రింక్ తాగితే చాలు.. అదనపు కొవ్వు అమాంతం మాయమైపోతుంది..

ఈ చట్నీలో మీరు ఉపయోగించే ఎండుమిర్చి మీ రుచికి సరిపడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్లు ఎక్కువగా తక్కువ తినాలి తక్కువ ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని మరింత ఆరోగ్యవంతంగా చేయాలంటే మామూలు నూనె బదులు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె వేసి తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా ఈ దోస పై నుంచి మీరు చీజ్ కూడా గ్రేట్ చేసి లేకపోతే ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News