Keerthy Suresh: చీరలో కీర్తి సురేష్.. వెన్నెలలో మెరిసిపోయిన హీరోయిన్

Keerthy Suresh saree Instagram pics: కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో నిజంగానే..  మహానటిగా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ఆ తర్వాత నుంచి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ప్రస్తుతం చీరలో కీర్తి సురేష్ ఫోటోలు.. కొన్ని వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

1 /5

నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలు.. ఎక్కువగా చేసే హీరోయిన్స్ చాలా తక్కువగా కనిపిస్తారు. ఇలాంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. రామ్ హీరోగా వచ్చిన నేను శైలజా.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

2 /5

మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో కూడా వరస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. నేను శైలజ, నేను లోకల్ లాంటి.. మంచి విజయాల తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. వచ్చిన మహానటి సినిమాలో మెరిసింది కీర్తి సురేష్.

3 /5

ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కనిపించి అందరిని తెగ మెప్పించింది. ఈ సినిమాకిగాను.. నేషనల్ అవార్డు సైతం అందుకుంది. ఆ సినిమా తరువాత కీర్తి సురేష్ పాపులారిటీ మారిపోయింది. వరసగా హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమా ఛాన్సులు.. ఆమెకి రాసాగాయి.

4 /5

అయితే కొద్ది రోజులు.. వరస ఫ్లాప్స్ అందుకున్న.. కీర్తి సురేష్ ఫైనల్ గా నాని హీరోగా వచ్చిన.. దసరా సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ బేబీ జాన్ అని హిందీ సినిమాతో.. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

5 /5

తెలుగు, తమిళ భాషల్లో.. రఘు తాత అనే చిత్రంతో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కీర్తి సురేష్.. చీరలో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి