Republic Day Parade: రిపబ్లిక్ డే పరేడ్ లో వాళ్లకు అనుమతి లేదు.. మార్గదర్శకాలు జారీ
Republic Day Parade Guidelines: రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనే వారికి ఢిల్లీ పోలీసులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ వేడుకకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అదే విధంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని వారిని కూడా అనుమతించబోమని తేల్చి చెప్పారు.
Republic Day Parade Guidelines: రిపబ్లిక్ డే వేడుకలు బుధవారం జరగనున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఢిల్లీ పోలీసులు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే వేడుకల్లోకి అనుమతిస్తామని ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. దాంతో పాటు 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలనూ రిపబ్లిక్ డే పరేడ్ కు అనుమతించబోమని ప్రకటించారు.
జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని కొవిడ్ నియంత్రణ చర్యలను చేపట్టాలని ఢిల్లీ పోలీసులు తెలిపారు. “రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే రిపబ్లిక్ డే పరేడ్ కు అనుమతి. సందర్శకులు తమ తమ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాన్ని తప్పక తీసుకురావాలని" ఢిల్లీ పోలీసులు అభ్యర్థించారు.
15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదు..
దేశంలో గత ఏడాది జనవరి 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను.. తొలుత ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులకు పంపిణీ చేశారు. జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు 18 ఏళ్ల వయసు వారి వరకు కరోనా వ్యాక్సిన్ ను అందజేస్తున్నారు.
అయితే ఈ నెలలో 15 - 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు టీకా వేయడం ప్రారంభించారు. దీంతో పాటు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉద్ధృతి పెరగడం వల్ల 60 ఏళ్లు పైబడిన వారికి సహా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా బూస్టర్ డోసును అందజేస్తున్నారు. ఈ క్రమంలో 15 ఏళ్లలోపు వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయని నేపథ్యంలో వారిని రిపబ్లిక్ డే పరేడ్ కు అనుమతించడం లేదని తెలుస్తోంది.
మరికొన్ని మార్గదర్శకాలు
రాజ్ పథ్ లోకి ఉదయం 7 గంటల నుంచి సందర్శకులను అనుమతించనున్నారు. ఆ సమయానుగుణంగా సందర్శకులు రావాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. భద్రతా తనిఖీ సమయంలో వారివారి గుర్తింపు కార్డులను తీసుకురావాలని అభ్యర్థించారు. కారు పార్కింగ్ ఏరియాలో రిమోట్ కంట్రోల్డ్ కార్ లాక్ కీ లను డిపాజిట్ చేసే సదుపాయం ఉందని తెలిపారు.
రిపబ్లిక్ డే పరేడ్ లో భద్రతా బలగాలు
రిపబ్లిక్ డే విధుల కోసం దేశ రాజధానిలో సుమారు 27 వేల మంది పోలీసులు మోహరించనున్నారు. గణతంత్ర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడకుండా ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ ఆస్థానా తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.