గురువారం ఆర్బీఐ ఐసీఐసీఐ బ్యాంకుకి షాకిచ్చింది. దేశంలో అతిపెద్ద ప్రవేట్ బ్యాంకు, సంస్థకు చెందిన హోల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెచ్యురిటీ (హెచ్‌టీఎం) పోర్టుఫోలియో సెక్యూరిటీల విక్రయాల్లో నిబంధనలను పాటించడంలో విఫలమైందంటూ ఐసీఐసీఐకి ఆర్బీఐ రూ.589 మిలియన్ల జరిమానా విధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 46 (4) (i), సెక్షన్ 47ఏ (1) (సి) లోని నిబంధనల ప్రకారం  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కాగా హెచ్‌టీఎం సెక్యురిటీలను కస్టమర్లు ఇప్పటికే కొన్న నేపథ్యంలో.. వాటి చెల్లుబాటు/రద్దుపై మాత్రం ఏ నిర్ణయాన్ని కేంద్ర బ్యాంకు వెల్లడించలేదు.


"హెచ్‌టీఎం పోర్టుఫోలియో సెక్యూరిటీల విక్రయాల్లో నిబంధనలు పాటించలేదంటూ మార్చి 26, 2018న ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంతో ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ (ది బ్యాంక్)కి  589 మిలియన్ రూపాయల పెనాల్టీ విధించింది " అని ఆర్బిఐ ఆ ప్రకటనలో పేర్కొంది. నిబంధనలకు లోబడే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది.