Rhea case: బెయిల్ పిటీషన్ పై నేడే విచారణ
సుశాంత్ మరణానంతర పరిణామాల్లో అరెస్టైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటీషన్ పై నేడు ( సెప్టెంబర్ 10 ) విచారణ జరగనుంది. ఈ కేసులో తమను తప్పుగా ఇరికించారనేది రియా ఆరోపణగా ఉంది.
సుశాంత్ ( Sushant singh ) మరణానంతర పరిణామాల్లో అరెస్టైన రియా చక్రవర్తి ( Rhea Chakraborty ), ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ( Showik Chakraborty ) ల బెయిల్ పిటీషన్ పై నేడు ( సెప్టెంబర్ 10 ) విచారణ జరగనుంది. ఈ కేసులో తమను తప్పుగా ఇరికించారనేది రియా ఆరోపణగా ఉంది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం పలు మలుపులు తిరుగుతున్న పరిస్థితి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐతో పాటు ఈడీ సైతం దర్యాప్తు చేస్తోంది. కొత్తగా నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ కూడా రంగంలో దిగింది. ఈ కేసులో అరెస్టైన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. నార్కోటిక్ డ్రగ్ మరియు సైకోట్రోఫిక్ సబ్ స్టెన్సెస్ చట్టం కింద ఆమెపై..షోవిక్ పై కేసు నమోదైంది. సుశాంత్ మరణం కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో డ్రగ్స్ కోణంలో ఆమె పాత్రపై ఆరోపణలు వచ్చాయి. నార్కోటిక్స్ బ్యూరో ( norcotics bureau ) మూడ్రోజులపాటు విచారించిన అనంతరం రియాను అదుపులో తీసుకుంది నార్కోటిక్స్ బ్యూరో.
అయితే ఈ కేసులో తనని తప్పుడుగా ఇరికించారని ఆరోపిస్తూ..బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకుంది. ఈడీ నుంచి అధికారిక సమాచారం అందుకున్న తరువాత నార్కోటిక్స్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. Also read: Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు