Congress Protests: మార్చి 31న డప్పులు, గంటలు మోగించండి... దేశ ప్రజలకు కాంగ్రెస్ పిలుపు
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది.
Congress Nationwide Protests: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 31న వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. ఆరోజు ఉదయం 11గంటలకు దేశ ప్రజలంతా తమ ఇళ్ల ముందు, బహిరంగ ప్రదేశాల్లో దండలు వేసిన గ్యాస్ సిలిండర్లతో, గంటలు, డప్పులు మోగిస్తూ నిరసన తెలపాలని పార్టీ పిలుపునిచ్చింది. చెవిటి బీజేపీకి దేశ ప్రజల ఆక్రందన వినిపించేలా ఇలా గంటల మోతకు పిలుపునిచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 వరకు జిల్లా కేంద్రాల్లో, ఏప్రిల్ 7న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ తాజా నిర్ణయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను వంచించిందని మండిపడ్డారు. 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచని ప్రభుత్వం.. ఎన్నికలు ముగియగానే ధరలు పెంచేసిందన్నారు. పేదలను కొట్టి ఖజానా నింపుకోవాలనే మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని ఇది బయటపెట్టిందన్నారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ ఫస్ట్ లాక్‌డౌన్ సందర్భంగా హెల్త్ కేర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ప్రజలంతా తమ ఇళ్ల ముందు నిలబడి గంటలు మోగించాలని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మోదీ పిలుపుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై నిరసన తెలిపేందుకు ఇదే పద్దతిని అనుసరించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Electricity Demand in Telangana: తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
Also read: Indian Exports: 2021-22లో భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook