Bhoiguda fire mishap: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి- మృతుల కుటుంబలకు పరిహారం ప్రకటన!

Bhoiguda fire mishap: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్​ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2022, 12:39 PM IST
  • బోయిగూడ ఘటన మృతులకు ప్రధాని సంతాపం
  • కార్మికుల మృతి బాధాకరమని వెల్లడి
  • మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
Bhoiguda fire mishap: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి- మృతుల కుటుంబలకు పరిహారం ప్రకటన!

Bhoiguda fire mishap: సికింద్రాబాద్‌ బోయగూడలోని.. గోడౌన్​లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరగటం బాధకారమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున నష్టపరిహారం ప్రకటించారు.

కార్మికుల మృతి వారి కుటుంబాలకు తీరనిలోటన్నారు ప్రధాని. ఈ కష్టసమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు..

గోడౌన్​లో షార్ట్ సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. 11 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.

పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ పరిహారం చెల్లించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్​ చేసింది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్​ గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also read: Bhoiguda fire accident: అగ్ని ప్రమాద ఘటనపై సీఎం స్పందన- బాధితులకు నష్ట పరిహారం ప్రకటన

Also read: Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News