ఢిల్లీ: దాణా కుంభ కోణంలో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూకు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాజా తీర్పుతో ఎన్నికల సమయంలో జనాల్లో ఉండాల్సి లాలు జైలుకే పరిమితం అవ్వాల్సి వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన  బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నిరాకరించడంతో బీహార్ ప్రజలకు ఆవేదతో కూడిన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల పండుగలో ప్రజలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని బాధను వ్యక్తం చేశారు. తన  44 ఏళ్ల  రాజకీయ జీవితంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకుండా జరుగుతున్న తొలి ఎన్నిక ఇదేనని లేఖలో లాలూ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ నిరాకరిండంతో తాను జైలు నుంచే మీకు లేఖను రాస్తున్నానని తెలిపారు. తన లేఖను అర్థం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ విలువలను కాపాడుతారని ఆశిస్తున్నానని అన్నారు.


బీహార్ లో కాంగ్రెస్ పార్టీ లాలూ పార్టీతో  కలిసి కూటమిగా ఏర్పడి లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది. మరోవైపు జేడీయూ, బీజేపీ కలిసి బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ బీహార్ ప్రజలు ఇలా బహిరంగ లేఖ రాశారు.