ఆర్కే నగర్ కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో దినకరన్
ఆర్కే నగర్ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆర్కే నగర్ ఉపఎన్నిక జరిగిన విషయం విదితమే.
ఆర్కే నగర్ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆర్కే నగర్ ఉపఎన్నిక జరిగిన విషయం విదితమే. కాగా తొలిరౌండ్ ముగిసేసరికి అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ వర్గం అభ్యర్థి టిటివి దినకరన్ 419 ఓట్లతో, రెండో రౌండ్ లో 1,891 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, దినకరన్ మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంది. మొత్తం 19 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. తుది ఫలితాలు మధ్యాహానికల్లా వెల్లడవుతాయి.
కాగా, కౌంటింగ్ జరుగుతున్న క్వీన్ మేరీ కాలేజీలో దినకరన్, అన్నాడీఎంకే వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. కౌంటింగ్ అధికారులపై వారు దాడికి తెగబడ్డారు. దీంతో కౌంటింగ్ ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుచేస్తున్నారు. కౌటింగ్ కొనసాగుతోంది.
అన్నాడీఎంకే మద్దతుదారులు మీడియా, జర్నలిస్టులు కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మ తరువాత టిటివి దినకరన్ తమిళనాడు మాస్ లీడర్ అని ఆయన వర్గీయులు చెప్పారు.
కాగా మూడో రౌండ్ ముగిసేసరికి దినకరన్ 7,256 పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూధనన్ 2,737 ఓట్లతో, డీఎంకే అభ్యర్థి మురుగు గణేష్ 1,181 ఓట్లతో, బీజేపీ అభ్యర్థి నాగరాజన్ కు 66 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 102 ఓట్లు పడ్డాయని అధికారులు తెలిపారు.