Kerala Road Accident: అప్పటివరకూ పెళ్లి వేడుకతో సంబరాలు చేసుకుంటున్న రెండు కుటుంబాలలో విషాదం నిండింది. పెళ్లి బస్సు బోల్తా పడటంతో చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. కేరళలో ఈ విషాదం ఆదివారం చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కర్ణాటకకు చెందిన కొందరు పెళ్లి వేడుకకు కేరళ వెళ్తుండగా పెళ్లి బస్సు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడటం(Road Accident)తో ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి 55 మందితో వెళ్తున్న పెళ్లి బృందం కేరళలోని కాసరగడ్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు పనతూర్‌ గ్రామం సమీపంలో అదుపుతప్పింది. ఇంటిని ఢీకొట్టిన అనంతరం పెళ్లివారి బస్సు బోల్తా పడింది. 


Also Read: Mi 10i Price (Launch Date): 108 మెగా పిక్సెల్ కెమెరా.. పూర్తి ఫీచర్లు ఇవే


 



 


ఓ చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మరికొందరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కన్షాన్‌ఘడ్, పలథడిలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేరళ(Kerala) సీఎం పినరయి విజయన్ విచారణం వ్యక్తం చేశారు. కాగా, మృతులంతా కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.


Also Read: ​SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook