ఆప్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. రాకెట్ లాంఛర్లో జరిగిన దాడుల్లో 8 మంది సామాన్యులు మృతి చెందారు. దాడికి తాలిబన్లే కారణమని ప్రభుత్వం వాదిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇటీవలి కాలంలో ఆప్ఘన్ ( Afghan ) ‌లో దాడులు ఎక్కువయ్యాయి. కొన్ని వారాలుగా యూనివర్శిటీలు, ఇతర ప్రాంతాలపై జరిగిన దాడుల్లో 50 మందికిపైగా సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు కారణం తాలిబన్లే ( Talibans )నని  ఆప్ఘన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్‌ అరియాన్‌ ( Tariq Arian )వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తాలిబాన్లు 53 ఆత్మాహుతి దాడులు,1250 పేలుళ్లు జరపగా..1210 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని..2 వేల 5 వందలమంది గాయపడ్డారని  తారిక్ అరియాన్ తెలిపారు. ఉదయం రెండు స్టిక్కీ బాంబు పేలుళ్లు కూడా జరిగాయని తెలుస్తోంది. 


ఇవాళ ఉదయమైతే వరుసగా 23 రాకెట్ ( Rocket launchers ) లు దూసుకొచ్చి దాడులు జరిపాయని తారిఖ్ అరియాన్ స్పష్టం చేశారు. కాబూల్‌‌లోని సెంట్రల్‌, ఉత్తర ప్రాంతాలలో దాడులు జరిగాయి. ఈ ప్రాంతం అ‍త్యంత భద్రత కలిగిన గ్రీన్‌ జోన్‌. అక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. దాడి అనంతరం కూలిన భవనాలు, పగిలిన కిటీకీలతో ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. Also read: Covid19 vaccine: వ్యాక్సిన్ తయారీ సరే..ఉత్పత్తి, పంపిణీ సాధ్యమేనా