RRB results 2021: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2021 పరీక్ష ఫలితాలు విడుదల- చెక్ చేసుకోండిలా..
RRB results 2021: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెదటి దశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2020 డిసెంబర్ నుంచి 2021 జులై వరకు జరిగిన పరీక్ష ఫలితాల వివరాలు ప్రకటించింది బోర్డు.
RRB results 2021: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ఎన్టీపీసీ 2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అన్ని రీజియన్లకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రాంతాల వారీగా అధికారిక వెబ్సైట్లో ఈ ఫలితాల వివరాలు పొందుపరిచింది ఆర్ఆర్బీ. అభ్యర్థులు ఎన్టీపీసీ మొదటి దశ కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ (సీబీటీ 1)కు సబంధించి ప్రాంతీయ వెబ్సైట్లలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని (RRB NTPC results 2021) తెలిపింది.
2020 డిసెంబర్ 28 నుంచి 2021 జులై 31 వరకు ఈ పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలో కలిపి మొత్తం 1,26,30,885 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
సికింద్రాబాద్ రీజియన్ నుంచి 64,693 మంది, ముబయి రీజియన్ నుంచి 73,320 మంది, అహ్మదాబాద్ నుంచి 20,495 మంది, అజ్మేర్ రిజీయన్ నుంచి 35,488 మంది షార్ట్ లిస్ట్ అయినట్లు తెలిపింది ఆర్ఆర్బీఐ.
సీబీటీ 1 పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ (సీబీటీ 2) పరీక్ష రాసేందుకు (RRB NTPC stage 2 exam) వీలుంది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి..
ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
ఆర్ఆర్బీఐ ఎన్టీపీసీ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్‌లోకి లాగ్ఇన్ అవ్వాలి.
ఇందులో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2021 రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో కనిపిస్తాయి.
ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో మీ రూల్ నంబర్ ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి.
మీ రూల్ నంబర్ క్వాలిఫయర్ జాబితాలో ఉంటే.. రిజల్ట్‌ను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అలా డౌన్‌లోడ్ చేసుకున్న కాపీని భద్రంగా ఉంచుకోవాలి. రెండో దశలోనూ క్వాలిఫై అయిన తర్వాత ఈ కాపీ ఉపయోగపడుతుంది.
Also read: Indian Army Day 2022: ఇవాళ ఇండియన్ ఆర్మీ డే.. 'జనవరి 15'నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా
Also read: మహారాష్ట్రలో విరుచుకుపడుతోన్న కరోనా.. 136 మంది పోలీస్ సిబ్బందికి పాజిటివ్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook