Mulayam Singh Yadav Dies: సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ ( Mulayam Singh Yadav Death) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ (92) కన్నుమూశారు. పూర్వాలోని తన స్వగ్రామం కాకోర్‌లో శనివారం (అక్టోబర్ 3) రాత్రి ఆయన తుది శ్వాస (Mulayam Singh Yadav Dies) విడిచారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఔరారియా జిల్లాలో ఆదివారం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు జరిగాయి.
Also Read : YS Jagan: ఈసీ గంగిరెడ్డికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళి
సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌తో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్సీగా సైతం ములాయం సింగ్ యాదవ్ సేవలందించారు. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సీనియర్ నేత ములాయం మరణం పట్ల నివాళి అర్పించారు.
Also Read : SVIMS Hospital: తిరుపతి కోవిడ్ సెంటర్‌లో ప్రమాదం.. గర్భిణీ మృతి
1949లో తన 21వ ఏట సర్పంచ్‌గా ఎన్నికైన ములాయం సింగ్ యాదవ్ వరుసగా ఐదు పర్యాలు ఆ పదవిలో కొనసాగారు. 15 ఏళ్లపాటు బ్లాక్ చీఫ్‌గా, 1990 నుంచి 20 ఏళ్లపాటు శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. కాన్పూర్ ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయి ఇటీవల ఇంటికొచ్చిన నేత వయసురీత్యా సమస్యలతో సతమతమవుతూ కన్నుమూశారు. గ్రామస్థాయి నుంచి ఎదిగిన నేత ములాయం మృతిపట్ల పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
Also Read : JEE Advanced 2020 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe