Farmers Tractor March Supended: పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliament Winter Session) సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (Samyukt Kisan Morcha) ఆధ్వర్యంలో తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ (Tractor March) రద్దయింది. ఢిల్లీ శివారులోని సింఘు బోర్డర్ వద్ద శనివారం (నవంబర్ 27) జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైతు నేత దర్శన్ పాల్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దర్శన్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ' సోమవారం తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని (Tractor March) రద్దు చేశాం. రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు ఉద్యమంలో అమరులైనవారి జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటుకు భూమి కేటాయింపు, లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనపై చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ నుంచి అజయ్ మిశ్రా తొలగింపు, తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాం.' అని పేర్కొన్నారు. ఈ అంశాలపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూశాక.. డిసెంబర్ 4న భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.


సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు (Farmers Protest) ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో రైతు సంఘాలు ట్రాక్టర్ ర్యాలీని తలపెట్టాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతీరోజూ 500 మంది రైతులతో పార్లమెంటుకు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు నేతలు నిర్ణయించారు. ఇంతలోనే సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటన చేశారు. సాగు చట్టాల రద్దు బిల్లుకు గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీంతో ట్రాక్టర్ ర్యాలీ విషయంలో పునరాలోచనలో పడిన రైతు సంఘాల నేతలు.. తాజాగా దాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. సాగు చట్టాల రద్దుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేసినప్పటికీ... పార్లమెంటులో ఆ చట్టాల రద్దు ప్రక్రియ ప్రారంభమయ్యేంతవరకూ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Also Read: Headmaster : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్మాస్ట‌ర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook