Chief Justice of supreme court: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా..
Chief Justice of supreme court: భారత 51వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..సంజీవ్ ఖన్నాతో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
Chief Justice of supreme court:భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రైపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువరు కేంద్ర మంత్రులుతో పాటు న్యాయ శాఖ మంత్రి హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సంజీవ్ ఖన్నాకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఆయన అతి తక్కువ కాలం 51వ సీజేఐగా పనిచేయనున్నారు. వచ్చే యేడాది మే 13 వరకు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
2019 జనవరి నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా... ఈ ఆరేళ్ల కాలంలో 117 తీర్పులు రాశారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా పలు ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలక తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ పలు చారిత్రక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేశారు.
1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఆయన ఫ్యామిలీలో మూడో న్యాయమూర్తి. తండ్రి దేవరాజ్ ఖన్నా దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. పెదనాన్న హెచ్.ఆర్.ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. దిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 1983లో దిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆ రత్వా ప్రాక్టీస్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. ట్యాక్సేషన్, ఆర్బిట్రేషన్, కమర్షియల్, కంపెనీ లా కేసులు వాదించారు. 2005 జూన్ 25న దిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter