Sarpancha candidate receives just one vote in Gujarat Panchayat Polls: గుజరాత్ పంచాయతీ ఎన్నికల్లో (Gujarat Panchayat Polls) ఓ అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో అతనికి కేవలం ఒకే ఒక్క ఓటు పోల్ అయింది. అంటే, ఆ అభ్యర్థి వేసుకున్న ఓటు తప్ప మరో ఓటు పడలేదు. ఆ అభ్యర్థి ఇంట్లో 12 మంది కుటుంబ సభ్యులు ఉండగా... భార్య సహా ఎవరూ అతనికి ఓటు వేయకపోవడం గమనార్హం. కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని తెలిసి కౌంటింగ్ కేంద్రం వద్దే అతను కుప్పకూలిపోయాడు. గుజరాత్‌లోని (Gujarat) వాపి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ అభ్యర్థి పేరు సంతోష్ హల్‌పతి. రెండు రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో (Gujarat Panchayat Polls) ఛార్వాలా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడించగా అతనికి కేవలం ఒక్క ఓటు మాత్రమే పోల్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలిసి సంతోష్ గుండె పగిలినంత పనైంది. తీవ్ర విచారంతో కౌంటింగ్ కేంద్రం వద్దే కుప్పకూలిపోయాడు. 


ఎవరు ఓటేసినా, వేయకపోయినా... కనీసం తన భార్య, కుటుంబ సభ్యులైనా తనకు ఓటేస్తారని భావించానని సంతోష్ వాపోయాడు. ఎన్నికల్లో ఓటమి కంటే కుటుంబ సభ్యులెవరూ తనకు ఓటు వేయకపోవడం బాధ కలిగిస్తోందన్నాడు. 'ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయి... అదేమీ పెద్ద విషయం కాదు... కానీ ఒకే ఒక్క ఓటు పోల్ అవడం బాధ కలిగిస్తోంది. ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయకపోవడంపై చింతిస్తున్నాను.' అని సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, రెండు రోజుల క్రితం గుజరాత్‌లోని (Gujarat) 8686 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం (డిసెంబర్ 21) 6481 పంచాయతీల ఫలితాలు వెల్లడించారు. 


Also Read: Cold Wave in Telangana: చలికి వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. కనిష్టంగా 4.6 డిగ్రీలు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి